పాడి కౌశిక్ ఎదుట బీఆర్ఎస్ లీడర్ల అత్యుత్సాహం.. తల్వార్లతో ప్రమాదకర విన్యాసాలు

బీఆర్ఎస్ నేతల అత్యుత్సాహం పబ్లిక్ ని భయాందోళనకు గురి చేసింది. సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థులను ప్రకటించిన తరువాత టికెట్ దక్కించుకున్న ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సెప్టెంబర్ 2న తొలి సారి హుజూరాబాద్ నియోజకవర్గానికి వచ్చారు. 

ఆయనకు స్వాగతం తెలిపేందుకు పార్టీ నేతలు సిద్ధమయ్యారు. గజమాలతో సత్కరించి, డోలు వాయిద్యాలు, డప్పు దరువులతో ఊరేగింపుగా ఆర్టీసీ డిపో క్రాస్ నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. 

అంతటితో ఆగకుండా కొందరు కార్యకర్తలు తల్వార్(పదునైన కత్తులు)లను తీసి వాటితో విన్యాసాలు చేశారు. అవి ఎక్కడ ఎవరికి తగిలి ప్రమాదం జరుగుతుందో తెలియక పబ్లిక్ భయపడ్డారు. ఇతరుల ప్రాణాలపైకి తెచ్చే అభిమానం ఎందుకని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.