రాష్ట్రంలో ఎండుతున్న పంటలను పరిశీలించి.. రైతులకు బాసటగా నిలిచేందుకు బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ మార్చి 31వ తేదీ ఆదివారం రోజున జనగామ, యాదాద్రి, సూర్యపేట జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా రైతులను అడిగి వారి బాధలను తెలుసుకున్నారు.
అయితే కేసీఆర్ పర్యటనపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. కావాలనే ప్రభుత్వంపై బురద జల్లేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ పంట పొలాలను పరిశీలించేముందు బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు ఫోటో షూట్ లు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ALSO READ :- Nani Upcoming Movies: నాని లైనప్ చూస్తే మతిపోవాల్సిందే..సాలిడ్ హిట్స్ కన్ఫమ్!
ఈ వీడియోలో ప్లకార్డులు పట్టుకుని రైతులు ఇబ్బంది పడుతున్నట్లుగా చూపిస్తూ వీడియోలు, ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో వదిలి ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంపీ ఎన్నికల ముందు, నాలుగు సీట్ల కోసం రైతులను బీఆర్ఎస్ వాడుకుంటుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.