మరికల్, వెలుగు: నారాయణపేట ఎమ్మెల్యే బర్త్‌డే కోసం మరికల్‌లోని హైవేపై బీఆర్ఎస్ నాయకులు టెంట్ వేశారు. టెంట్ ఎందుకు వేశారని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మండల కేంద్రంలోని చౌరస్తాలో కేక్ కటింగ్ కోసంహైవేపై టెంట్ వేస్తారా అంటూ బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేశారు. బీఆర్ఎస్ నాయకులు ఏమి చేసినా, మద్దతు ఇస్తారా అని పోలీసులను నిలదీశారు. రోడ్డుపై టెంట్ వేయడానికి అనుమతి ఉందా అని ఎస్ఐ హరిప్రసాద్‌రెడ్డిని నిలదీయగా, డీఎస్పీని అడగాలని సూచించారు. రోడ్డుపై ఆందోళన చేయడం సరి కాదని, పక్కకు వెళ్లాలని ఎస్ఐ ఎంత బతిమిలాడినా వారు ససేమిరా అన్నారు.
టెంట్ తీస్తేనే ఆందోళన విరమిస్తామని తేల్చిచెప్పారు. సీఐ శ్రీకాంత్‌రెడ్డి అక్కడికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టి, రెండు పార్టీల నేతలను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. వేడుకలు పూర్తయ్యాక సొంత పూచికత్తుపై విడుదల చేశారు. బీజేపీ నాయకులు తిరుపతిరెడ్డి, గోవర్ధన్‌గౌడ్, భాస్కర్‌రెడ్డి, వేణు, రమేశ్, నరేశ్‌గౌడ్, కాంగ్రెస్ నాయకులు బి.వీరన్న, గొల్ల కృష్ణయ్య, హరీశ్‌కుమార్, అంజిరెడ్డి, మొగులప్ప, మల్లేశ్, గోవర్ధన్, రవి, గొల్ల రాజు, జంగిడి ఆంజనేయులు పాల్గొన్నారు.