పల్లా రాజేశ్వర్ రెడ్డి అరెస్టుకు నిరసనగా రాస్తారోకో

పల్లా  రాజేశ్వర్ రెడ్డి అరెస్టుకు నిరసనగా రాస్తారోకో

చేర్యాల, వెలుగు: నిరుద్యోగ జేఏసీ ఉద్యమ నాయ‌‌కుడు మోతీలాల్ నాయ‌‌క్ పరామర్శించేందుకు వెళ్లిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని అరెస్టు చేయడంపై చేర్యాలలో బీఆర్ఎస్ నాయకుల సోమవారం రాస్తారోకో చేపట్టారు.

హైదరాబాద్​లోని గాంధీ హాస్పిటల్​కు వెళ్లిన పల్లాను అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. కార్యక్రమంలో  మున్సిపల్ చైర్మెన్ స్వరూప రాణి,  ఎంపీపీ కర్ణాకర్, వెంకట్ రెడ్డి, కృష్ణమూర్తి, నాగేశ్వర్, సంతోష్ , అంజయ్య పాల్గొన్నారు.