జగిత్యాల జిల్లా చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థిని మార్చాలని... నియోజకవర్గంలో ఎమ్మెల్యే గ్రాఫ్ పడిపోయిందని బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. సుంకే రవిశంకర్ కాకుండా వేరే వారికి అవకాశం ఇవ్వాలని నియోజకవర్గంలోని కొడిమ్యాల, గంగాధర, రామడుగు మండలంలోని నాయకులు నల్గొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామికి 116 కొబ్బరికాయలు కొట్టి నిరసన తెలిపారు.
నియోజకవర్గంలో ఎమ్మెల్యే గ్రాఫ్ కరెక్ట్ లేదని అతనికి బీఫామ్ ఇస్తే పార్టీ ఓడిపోతుందని... మరొకరికి బీఫామ్ కేటాయించాలని సీఎం కేసీఆర్ ను వేడుకున్నారు.
ఈ సందర్భంగా నల్లగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా రెండు రోజుల క్రితం నియోజక వర్గంలోని మల్యాల మండలంలో ఎమ్మెల్యే ప్రోగ్రాంను 12 మంది సర్పంచులు బై కాట్ చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆ గొడవ సద్దుమణగక ముందే మరో నిరసన ప్రోగ్రాం చెయ్యడం రవి శంకర్ కు తలనొప్పిగా మారింది.