
నెట్వర్క్వెలుగు : గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని కోరుతూ గురువారం కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
కామారెడ్డిలో పార్టీ టౌన్ ప్రెసిడెంట్ జూకంటి ప్రభాకర్‌రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ చెలిమెల భానుప్రసాద్ పాల్గొన్నారు. లింగంపేట, ఆర్మూర్, బాల్కొండ తదితర మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ లీడర్లు మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించారు.