రజతోత్సవ సభకు 3 వేల ఆర్టీసీ బస్సులు కావాలి

రజతోత్సవ సభకు 3 వేల ఆర్టీసీ బస్సులు కావాలి

ఆర్టీసీ ఎండీ సజ్జనార్​కు బీఆర్ఎస్​ నేతల వినతి

హైదరాబాద్, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు 3 వేల ఆర్టీసీ బస్సులు అద్దెకు కావాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. మూడు వేల బస్ ల అద్దె కోసం రూ.8 కోట్ల చెక్ ను ఆర్టీసీ ఎండీకి అందించారు. ఈ కార్యక్రమంలో రావుల చంద్రశేఖర రెడ్డి, గెల్లు శ్రీనివాస్, కురువ విజయ్, తుంగ బాలు పాల్గొన్నారు.