కొమురం భీం జిల్లా చింతలమానేపల్లి మండలంలో ప్రజా ప్రతినిధులు నాయకులు బీఆర్ఎస్ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేశారు. చింతలమానేపల్లి ఎంపీపీ డుబ్బుల నానయ్య, జేడ్పీటిసి డుబ్బుల శ్రీదేవి వెంకన్న, కోఆప్షన్ తో పాటు 12మంది మాజీ సర్పంచ్ లు, ఐదుగురు ఎంపీటీసీలు మూకుమ్మడిగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ALSO READ :- శివరాత్రి రోజున ఈ మంత్రం జపం చేయండి... బాధలు తొలగించుకోండి
మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఓటమికి కారణమైన బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో బీఆర్ఎస్ పార్టీ కలుపుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ.. చింతలమానేపల్లి మండల కేంద్రంలో శివాజీ చౌరస్తా వద్ద నిరసన చేశారు బీఆర్ఎస్ నాయకులు.