- ఎవరిదారి వారు చూసుకుంటున్న బీఆర్ఎస్ లీడర్లు
వర్థన్నపేట, వెలుగు : వరంగల్ జిల్లా వర్థన్నపేట మండలంలో కారు పార్టీ ఖాళీ అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత స్థానిక బీఆర్ఎస్ లీడర్లను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఎవరిదారు వారు చూసుకుంటున్నారు. ఆదివారం వర్థన్నపేట మున్సిపల్ చైర్ పర్సన్ అరుణ, ఇద్దరు కౌన్సిలర్లు రామకృష్ణ, రవీందర్ సహా బీఆర్ఎస్ ను వీడగా..
సోమవారం 5వ వార్డు కౌన్సిలర్ భర్త పాలకుర్తి సారంగపాణి కాంగ్రెస్లో చేరారు. స్థానిక ఎమ్మెల్యే నాగరాజుతో కలిసి కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆయన కాంగ్రెస్లో చేరారు. రేపటి నుంచి మరికొందరు కౌన్సిలర్లు, స్థానిక బీఆర్ఎస్ లీడర్లు కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది.