బోయినిపల్లి మండలంలో అభివృద్ధి పై చర్చకు సిద్ధం

బోయినిపల్లి,వెలుగు : మండలంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. గురువారం మండల కేంద్రంలో  ఎంపీపీ వేణుగోపాల్, పార్టీ మండల అధ్యక్షుడు కొండయ్య  మీడియాతో మాట్లాడారు. మండలంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని  కాంగ్రెస్ లీడర్​ మేడిపల్లి సత్యం వి ఆరోపణలే అన్నారు. ఎమ్మెల్యే రవిశంకర్ పై చేసిన ఆరోపణలను ఖండించారు.  

ఇంకా అవాకులు చావాకులు మాట్లాడితే తగిన బుద్ధి చెప్తామన్నారు. శుక్రవారం నుంచి ఎమ్మెల్యే  రవిశంకర్ మండలంలో ప్రచారం ప్రారంభిస్తారని తెలిపారు. సమావేశంలో రైతుబంధు అధ్యక్షుడు లచ్చిరెడ్డి, సెస్ డైరెక్టర్ సుధాకర్,  సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.