గంగాధర, వెలుగు : మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా మండలంలోని బీఆర్ఎస్ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మండల కేంద్రంలోని జ్యోతిబాపూలే బాలుర గురుకుల స్కూల్లో విద్యార్థులను నేలపై కూర్చోబెట్టి విన్యాసాలు చేయించారు. ‘మంత్రి పుట్టినరోజుకు విద్యార్థులకు ఏం సంబంధం’ అని పలువురు విమర్శిస్తున్నారు.
విద్యార్థులు అరగంట పాటు నేలపై కూర్చొని ఇబ్బందులు పడ్డారని, విద్యార్థులతో విన్యాసాలు చేయించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.