బడంగ్ పేటలో ఉద్రిక్తత. హైడ్రా సీఐపై బీఆర్ఎస్ దాడి.!

బడంగ్ పేటలో ఉద్రిక్తత. హైడ్రా సీఐపై బీఆర్ఎస్ దాడి.!

రంగారెడ్డి జిల్లా బడంగ్ పేటలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా సిబ్బందిని  బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. హైడ్రా సీఐ తిరుమలేష్ పై దాడికి యత్నించారు స్థానిక బీఆర్ఎస్  కార్పొరేటర్ భర్త శేఖర్ రెడ్డి పలువురు నేతలు. కాసేపు హైడ్రా అధికారులకు,బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ నేతలు హైడ్రా అధికారులను దూషించారు. వాగ్వాదానికి దిగుతూ దాడి చేసేందుకు యత్నించారు

అసలేం జరిగిందంటే..రంగారెడ్డి జిల్లా బడంగ్ పేట బోయపల్లి  ఎన్ క్లేవ్  కాలనీ వాసులు బోయపల్లి వెంకటరెడ్డి, శేఖర్ రెడ్డి పై హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు.  1982 జిపి లే అవుట్ చేసి ప్లాట్లను విక్రయించారని ఫిర్యాదు చేశారు. సర్వే నెంబర్ 39,4041,42,44 లో మొత్తం 5 ఎకరాలు ఏడు గుంటల భూమి ఉంది.  లే అవుట్ లో 236 గజాల పార్కు స్థలం కబ్జా చేసిన భూ యజమానులు. లే అవుట్ లో మూడు రోడ్లను కాలనీ వాసులకు చూపించారు భూ యజమానులు.రోడ్లు మూసి వేయడంతో కాలనీ వాసులు  హైడ్రాకు ఫిర్యాదు చేశారు. కాలనీ వాసుల ఫిర్యాదుతో  మార్చి 27న  దాదాపు 40 మంది హైడ్రా అధికారులు పార్క్ ఆక్రమించి కట్టిని నిర్మాణాలను ను కూల్చేందుకు వెళ్లగా బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు.బీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త శేఖర్ రెడ్డి హైడ్రా సీఐ తిరుమలేష్ పై దాడికి యత్నించారు. హైడ్రా అధికారులతో వాగ్వాదానికి దిగారు. కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది  

ALSO READ : హైదరాబాద్ సిటీలో బాక్స్ క్రికెట్ కోర్టు కూల్చేసిన హైడ్రా

స్థానిక పోలీసులకు బందోబస్తు సమాచారం ఇచ్చినట్టు హైడ్రా అధికారి తిరుమలేష్ తెలిపారు.  బడంగ్ పేట్ మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్టు హైడ్రాధికారి తిరుమలేష్ వివరణ. అధికారులను  అడ్డుకున్న వ్యక్తులపై కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. హైడ్రాధికారులకు ఫిర్యాదు చేస్తే వాటి పై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తిరుమలేష్ తెలిపారు.