జూలూరుపాడు బీఆర్ఎస్ లో అసమ్మతి!

జూలూరుపాడు, వెలుగు : బీఆర్ఎస్ ​కార్యక్రమాలకు సంబంధించి తెలంగాణ ఉద్యమకారులకు, పార్టీ సీనియర్ నేతలకు సమాచారం ఇవ్వకుంటే తమ కార్యాచరణను ప్రకటిస్తామని ఆ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల నరసింహరావు స్పష్టం చేశారు. గురువారం జూలూరుపాడు ఏవీఆర్​ఫంక్షన్ హాలులో ఆయన అసమ్మతి నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. వైరా బీఆర్ఎస్ అభ్యర్థి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఉద్దేశపూర్వకంగా కొందరిని పక్కన పెడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల నిర్వహించిన పలు కార్యక్రమాలు, సమావేశాలకు పిలవలేదని చెప్పారు.

 

ALSO READ: దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగినం : కడియం శ్రీహరి

జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయన్నారు. 14 ఏండ్లుగా కేసీఆర్​నాయకత్వంలో పనిచేస్తున్నవారిని అవమానించడం కరెక్ట్​కాదన్నారు. ఇలాగే ఉంటే వైరాలోని 5 మండలాల తెలంగాణ ఉద్యమకారులతో చర్చించి భవిష్యత్​కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకులు భూక్యా దేవిలాల్ నాయక్, బానోత్ బిక్కు నాయక్, రవికుమార్, లావుడియా దంజు నాయక్, వాంకుడోత్ బాలు తదితరులు పాల్గొన్నారు.