![చిలుకూరి టెంపుల్ ప్రధాన అర్చకుడిని పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు](https://static.v6velugu.com/uploads/2025/02/brs-leaders-visit-chilukuri-balaji-temple-archaka-swamy-rangarajan_N8fKzQVchZ.jpg)
చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ సౌందర్యను బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, పట్లోళ్ల కార్తీక్ రెడ్డి పరామర్శించారు. రంగరాజన్ సౌందర్య చిలుకూరి బాలాజీ దేవాలయంలో సేవలందిస్తున్నారని.. అలాంటి వారిపై దాడి జరిగిందంటే .. రాష్ట్రంలో శాంతిభద్రతలు అధోగతి పాలయ్యాయని కేటీఆర్ అన్నారు. దేవాలయ అర్చకుడిపై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ... భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.
ALSO READ | నా ఇల్లు కూల్చొద్దు: ప్రజావాణిలో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి