యాదాద్రి, వెలుగు : బీఆర్ఎస్ సైన్యం తిరగబడితే కాంగ్రెస్‌వాళ్లు రోడ్ల మీద తిరగలేరని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామచంద్రారెడ్డి, భువనగిరి పార్లమెంట్ఇన్చార్జి క్యామ మల్లేశ్ అన్నారు. భువనగిరిలోని పార్టీ జిల్లా ఆఫీసులో మీడియాతో వారు మాట్లాడారు.
బీఆర్ఎస్కు సుశిక్షతులైన 70 లక్షల కార్యకర్తల సైన్యం ఉందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతి విమర్శలు ఉండాలే కానీ.. దాడులు ఉండకూడదన్నారు. కాంగ్రెస్ మాత్రం దాడులను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు.