
కరీంనగర్ సిటీ, వెలుగు: బీఆర్ఎస్ నేత, మాజీ కార్పొరేటర్ జక్కని ఉమాపతి బుధవారం కాంగ్రెస్‌లో చేరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం కరీంనగర్‌కు రాగా కాంగ్రెస్ నేత మాచర్ల ప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఆయనకు మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతోపాటు బీఆర్ఎస్ లీడర్లు పాల్తేపు కిషన్, పోకల లక్ష్మీనారాయణ కూడా కాంగ్రెస్‌లో చేరారు.