శిక్షించి గుండుసున్నా ఇచ్చినా బీఆర్ఎస్ నేతలు మారుతలేరు : సీఎం రేవంత్ రెడ్డి

అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చలో మాటల యుద్ధం నడుస్తోంది. గత BRS సర్కార్ పై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పదేళ్లలో బీఆర్ఎస్ అన్ని రంగాల్లో అవినీతి చేసిందని అసెంబ్లీలో మండిపడ్డారు. గొర్రెల స్కాం, కేసీఆర్ కిట్లు, ఆఖరుకు ఆడ బిడ్డలకు ఇచ్చే బతుకమ్మ చీరల్లోనే స్కాం చేశారని విమర్శించారు సీఎం. 

ఇంత జరిగినా  సభలో మాజీ మంత్రి హరీశ్... ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. ఇలా తప్పుడు లెక్కలు చెప్తేనే ఎంపీ ఎన్నికల్లో ప్రజలు గుండుసున్నా ఇచ్చారని చెప్పారు సీఎం. రంగారెడ్డి జిల్లాలో భూములను కొల్లగొట్టి..చేవెళ్ల ప్రాజెక్టును నిర్వీర్యం చేసి..సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.