
ములుగు జిల్లాలో తీన్మార్ మల్లన్న టీమ్పై బీఆర్ఎస్ నాయకులు దాడి చేశారు. జూనియర్ ఔట్ సోర్సింగ్ కార్యదర్శుల సమ్మెకు మద్దతు తెలుపుతున్న తీన్మార్ మల్లన్న టీంపై దాడులు చేశారు.
కారులో వెళ్తున్న సమయంలో అడ్డగించారు. కారులో నుంచి షర్ట్ పట్టి బయటకు లాగి కొట్టారు. ఎలా పడితే అలా కొట్టారు. బండ బూతులు తిట్టారు. బీఆర్ఎస్ నేతల దాడిలో తీన్మార్ మల్లన్న టీమ్ కు చెందిన పలువురికి గాయాలు అయ్యాయి. బీఆర్ఎస్ నేతల దాడిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.