పాలన గాలికి వదిలేసిన బీఆర్ఎస్​.. బీజేపీ హింసావాద రాజకీయాలు

యాదాద్రి, వెలుగు : హింసావాద రాజకీయాలతో పాలిస్తున్న బీజేపీని ఓడించాలని సీపీఎం జాతీయ కార్యదర్శి  సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరిలో సీపీఎం నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీపీఎం అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. బీజేపీ ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కార్పొరేట్​ శక్తులకు ఊడిగం చేస్తున్నదని ఆరోపించారు.

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వ పాలన గాలికి వదిలేసిందన్నారు. మాట తప్పిన  బీఆర్ఎస్​ను ఓడించాలని పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ అధ్యక్షతన జరిగిన ప్రచారంలో చెరుపల్లి సీతారాములు, పైళ్ళ ఆశయ్య, బట్టిపల్లి అనురాధ, సీపీఎం భువనగిరి అభ్యర్థి కొండమడుగు నరసింహ,  మునుగోడు, నకిరేకల్​ అభ్యర్థులు దోనూరు నర్సిరెడ్డి, బొజ్జ చిన్న వెంకులు, లీడర్లు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం మంగ నర్సింహులు ఉన్నారు.