అతి త్వరలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారని.. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎల్పీ ( బీఆర్ఎస్ లెజిస్లేటివ్) పార్టీ.. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందని సంచలన కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్. 2024, జూలై 12వ తేదీ.. హైదరాబాద్ సిటీలో షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఈ వ్యాఖ్యలు చేశారాయన.
బీఆర్ఎస్ పార్టీలో కేవలం నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారని.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, పల్లా మాత్రమే ఉంటారని.. మిగతా ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారని స్పష్టం చేశారాయన. ఇదే సందర్భంలో కేసీఆర్ వ్యవహార శైలినీ తప్పుబట్టారు దానం. కనీసం ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వరని.. ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండరని.. ఎప్పుడూ ఫాంహౌస్ లోనే ఉంటారంటూ చురకలు అంటించారు దానం. ఒకవేళ అపాయింట్ మెంట్ ఇచ్చినా.. గంటల తరబడి కేసీఆర్ కోసం వెయిట్ చేయాలని.. బీఆర్ఎస్ పార్టీలో స్వేచ్ఛలేదన్నారు దానం.
Also Read:మారని మెడికల్ షాపుల తీరు.. 200 % ఎక్కువ రేటుకు అమ్ముతున్న మందులు
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. కేటీఆర్, అతని అనుచరులు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని.. ఆ వివరాలు అన్నీ బయటపెడతానని వెల్లడించారాయన. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకే.. ఆరు నెలల్లో అధికారంలోకి వస్తామంటూ కేటీఆర్ మేకబోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని.. బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ అధికారంలోకి రాదన్నారు దానం.
జైల్లో ఉన్న కవితను బయటకు తీసుకురాకుండా రాజకీయం చేస్తున్నారని.. కావాలనే కవితను జైల్లోనే ఉంచుతున్నారంటూ కేసీఆర్, కేటీఆర్ తీరును ప్రశ్నించారు దానం. అతి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ మూతపడుతుందని.. అది ఎంతో దూరంలో లేదని జోస్యం చెప్పారు ఎమ్మెల్యే దానం.