కారేపల్లి, వెలుగు : బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్దబోయిన ఉమాశంకర్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలోని తొడితలగూడెం ఎంపీటీసీ ఉమాశంకర్ రెండేళ్లుగా బీఆర్ఎస్ మండల అధ్యక్ష పదవిలో ఉన్నారు.
బీఆర్ఎస్కు, మండల పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి.. ఆ లేఖను ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తాతా మధుసూదన్ రావుకు పంపారు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.