
మెదక్ టౌన్, వెలుగు: కాంగ్రెస్‌కు ఓటేస్తే కష్టాల పాలవుతామని బీఆర్ఎస్ మెదక్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని రాయిన్‌పల్లి, శివ్వాయిపల్లి, మల్కాపూర్, కోంటూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఏ పథకాన్ని ప్రవేశపెట్టాలన్నా ఢిల్లీలో ఉన్న హైకమాండ్ నిర్ణయించాలి.. అదే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అందరి నిర్ణయం మేరకే సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశపెడతారన్నారు.
మైనంపల్లి హన్మంతరావు గొడవలు చేయడం మల్కాజిగిరిలో నడుస్తది కానీ.. మెదక్ నియోజకవర్గంలో కుదరదన్నారు. రూరల్ ఏరియాలో ఏ గ్రామాలు ఎక్కడ ఉన్నాయో కూడా మైనంపల్లి రోహిత్‌కు తెలియదని ఎద్దేవా చేశారు. మెదక్ అభివృద్ధి పరంపర కొనసాగాలంటే అందరూ తనను ఆశీర్వాదించాలని కోరారు. కార్యక్రమంలో మెదక్ జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్య, మెదక్ ఎంపీపీ జమున, పాల్గొన్నారు.
నిజాంపేట: తండాలను పంచాయతీలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని మెదక్ నియోజకవర్గ గిరిజన ఇన్చార్జ్ బీలు నాయక్ అన్నారు. మండల పరిధి బచ్చురాజ్ పల్లి తండాలో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో రామచందర్, కనక నాయక్, నర్సింలు నాయక్, సత్యం నాయక్ పాల్గొన్నారు.