
పాపన్నపేట, వెలుగు: బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని బీఆర్ఎస్ మెదక్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె మండలంలోని ఎల్లాపూర్, శానాయిపల్లి, తుమ్మలపల్లి, పొడ్చన్ పల్లి, పొడ్చన్ పల్లి తండా, నాగ్సన్ పల్లి, శేరిపల్లి, జయపురం, కొత్తపల్లిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు కాగానే సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా డాక్రా గ్రూపులో ఉన్న ప్రతి మహిళకు ప్రతి నెల రూ. 3 వేల జీవన భృతి అందిస్తామన్నారు.
అసైన్డ్ భూములపై రైతులకు హక్కులు కల్పిస్తామన్నారు. రూ.16 వేల రైతుబంధు, రూ.400కే గ్యాస్ సిలిండర్, సన్న బియ్యం, ఐదు వేల పింఛన్ అందజేస్తామన్నారు. మెదక్ లో 500 పడకల హాస్పిటల్మంజూరైందన్నారు. ఎన్నికలు రాగానే మైనంపల్లి హన్మంతరావు మెదక్ కు వచ్చాడని, ఆయన వచ్చాకే నియోజకవర్గంలో గొడవలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, రైతు సమన్వయ జిల్లా అధ్యక్షుడు సోములు, పార్టీ మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఏడుపాయల చైర్మన్ బాలాగౌడ్, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు జగన్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కుబేర్, ఏఎంసీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, నాయకులు సాయిరెడ్డి, శివ, బాబు, ఆంటోని, సర్పంచులు లింగారెడ్డి, వెంకటరమణ, మల్లేశం పాల్గొన్నారు