
- రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ పాత్ర అంతో ఇంతో’ అంటూ మంత్రి వ్యాఖ్యలు
- స్పీచ్‌ను అడ్డుకుని బీఆర్ఎస్సభ్యుల తీవ్ర అభ్యంతరం
హైదరాబాద్: శాసన మండలిలో గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ సభ్యుల నుంచి తీవ్ర అభ్యంతరాలను రేకెత్తించాయి. ఫలితంగా ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే పరిస్థితి ఏర్పడింది. మంత్రి జూపల్లి తన స్పీచ్‌లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మాజీ సీఎం కేసీఆర్ పాత్రను ప్రస్తావిస్తూ ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ పాత్ర అంతో ఇంతో ఉంది. పూర్తిగా లేదనడం లేదు’ అని అన్నారు. అయితే, గడిచిన పదేండ్లలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన జరగలేదని విమర్శించారు. ‘గతంలో అంకితభావంతో పని చేయలేదు, చిత్తశుద్ధితో పరిపాలన సాగలేదు అని జూపల్లి ఆరోపించారు. కాగా.. మంత్రి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జూపల్లి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో మండలిలో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది.
ALSO READ | తెలంగాణలో గ్రామీణ రోడ్లకు టోల్ ఛార్జీలు వేయం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి