అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన : పోలీస్ వ్యాన్‌లో తరలింపు

అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన : పోలీస్ వ్యాన్‌లో తరలింపు

అసెంబ్లీ ఆవరణలో ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను.. పోలీస్ వ్యాన్ లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు తరలించారు పోలీసులు. అసెంబ్లీ ఆవరణలో ఆందోళనలకు పర్మీషన్ లేదని పదే పదే పోలీసులు, మార్షల్స్ స్పష్టం చేసినా.. వారి మాటలను పట్టించుకోకుండా ఆందోళన చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే.

ఈ క్రమంలోనే పోలీసులు చర్యలు తీసుకున్నారు. కేటీఆర్, హరీశ్ రావుతో సహా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ ఆఫీసుకు.. పోలీస్ వ్యాన్ లో తరలించారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విషయంలో నిరసన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి కించపరిచారంటూ అసెంబ్లీలో ఆ పార్టీ నాయకులు నిరసనకు దిగారు.