కాంగ్రెస్ లోకి వలసలు కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ గ్రేటర్ పరిధిలోని శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ హస్తం గూటికి చేరతారని తెలుస్తోంది. జూలై 12న రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. అరికపూడి గాంధీతో పాటు మరో ఇద్దరు MLC లు,పలువురు కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ లో చేరతారని టాక్ వినిపిస్తోంది. నిన్న అరికపూడితో ఖమ్మం జిల్లా చెందిక MLC తాతా మధు, మరో MLC భేటీ అయ్యారు. వీరు ముగ్గురు ఇవాళ కాంగ్రెస్ లో జాయిన్ అవుతారని ప్రచారం జరుగుతోంది.
ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరితే బీఆర్ఎస్ ను వీడిన ఎమ్మెల్యేల సంఖ్య తొమ్మిదికి చేరుతుంది. జూలై 24 నుంచి బడ్జెట్ సమావేశాలు ఉన్నందున అప్పటిలోగా చేరికలు కంప్లీట్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.