రెచ్చిపోయిన బాల్క సుమన్ అనుచరులు.. కాంగ్రెస్ కార్యకర్తపై అర్థరాత్రి దాడి

చెన్నూర్​ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బాల్క సుమన్  అనుచరులు మరోసారి వీరంగం సృష్టించారు.  నవంబర్ 25వ తేదీ శనివారం అర్థరాత్రి కాంగ్రెస్  కార్యకర్త  బాలకృష్ణపై దాడికి దిగారు.  బాలకృష్ణ ఇటీవల కాంగ్రెస్  లో చేరాడు. 

ఈ క్రమంలో ఆ పార్టీలో ఎందుకు చేరావంటూ బాల్క సుమన్  అనుచరులైన రాకేష్, వెంకటేష్ అనే ఇద్దరు అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి దిగారని బాలకృష్ణ ఆరోపిస్తున్నారు. వారితో తన కొడుక్కు ప్రాణహాని ఉందని బాలకృష్ణ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో వీరే మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు సోదరుడి కొడుకును కూడా కొట్టారని బాలకృష్ణ తల్లి ఆరోపించింది.