ఫీజు రీయింబర్స్​మెంట్ ​బకాయిలు విడుదల చేయాలి

ఫీజు రీయింబర్స్​మెంట్ ​బకాయిలు విడుదల చేయాలి

 మాజీ మంత్రి హరీశ్​ రావు డిమాండ్

హైదరాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్​ మెంట్ బకాయిలను విడుదల చేయకుండా సుమారు 13 లక్షల మంది విద్యార్థుల జీవితాలను కాంగ్రెస్ ప్రభుత్వం అగమ్య గోచరంగా మార్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్  ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. మంగళవారం ఆయనను తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజేస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సభ్యులు  కలిశారు. 

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. కాగా..కాంగ్రెస్ గ్యారంటీల గారడీని హర్యానా ప్రజలు విశ్వసించలేదని హరీశ్ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  తెలంగాణ, కర్నాటకల్లో కాంగ్రెస్ చేసిన మోసాన్ని హర్యానా ప్రజలు నిశితంగా గమనించారని, ఆ ప్రభావం హర్యానా ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించిందన్నారు.