బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్ హౌజ్ అరెస్ట్..

తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల అరెస్టులు కొనసాగితున్నాయి.   మంగళవారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ని హైదరాబాద్ పోలీసులు ఆయన నివాసంలో హౌజ్ అరెస్ట్ చేశారు. దీంతో కోకాపేటలో ఎమ్మెల్యే హరీష్ రావు ఇంటి ఎదుట భారీగా పోలీసులు మోహరించారు.

మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ ని కూడా గచ్చిబౌలి పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. కేటీఆర్ ని గచ్చిబౌలిలో ఉన్న ఆయన నివాసం వద్ద అరెస్ట్ చేశారు. దీంతో గచ్చిబౌలిలో కేటీఆర్ నివాసం వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.