
సర్కార్ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాటం ఆగదన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు. ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్ ను మార్చే ఎన్నికలన్నారు. బండి సంజయ్ ఎంపీగా ఉండి...కరీంనగర్ కు ఒక్క రూపాయి తేలేదని విమర్శించారు. అబద్దాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బొందపెట్టాలన్నారు. పదేళ్ల సంవత్సరాల కేసీఆర్ పాలనలో మోటర్లు కాలలేదు కానీ కాంగ్రెస్ వచ్చి నాలుగు నెలల అవుతుంది మోటర్లు కాలుతున్నాయన్నారు. కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలు చేశారని.. లంబాడీలకు మంత్రి పదవి ఇచ్చి గిరిజనులకు గౌరవాన్ని పెంచారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పేరుతో అబద్ధపు జూట మాటలు తప్ప చేసింది ఏమీ లేదని విమర్శించారు. అబద్ధాలు చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ మద్దతుగా సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో ఎన్నికల ప్రచారంలో హరీశ్ పాల్గొన్నారు.