9 మంది ఎమ్మెల్యేలను ఇస్తే.. 9 మందిని కూడా కాపాడలేకపోయారు : హరీశ్ రావు​

9 మంది ఎమ్మెల్యేలను ఇస్తే.. 9 మందిని కూడా కాపాడలేకపోయారు : హరీశ్ రావు​

చేగుంట, వెలుగు: ఖమ్మం జిల్లా ప్రజలు కాం గ్రెస్​ పార్టీకి 9 మంది ఎమ్మెల్యేలను ఇస్తే వరదల్లో చిక్కుకున్న 9 మందిని కూడా వారు కాపాడలేకపోయారని బీఆర్ఎస్  ఎమ్మెల్యే హరీశ్​ రావు​అన్నారు. సోమవారం మెదక్  జిల్లా చేగుంటలో మీడియాతో ఆయన మాట్లాడారు. వరద  సహాయక చర్యల్లో ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులూ విఫలం అయ్యారని విమర్శించారు. సహాయ చర్యలపై దృష్టి పెట్టకుండా సీఎం రేవంత్  రెడ్డి తమపై బురద జల్లుతున్నారని ఆరోపించారు.

ప్రతిపక్షంలో ఉన్నపుడూ సీఎం తమపై విమర్శలు చేశారని, అధికారంలో ఉన్నప్పుడూ విమర్శలు చేస్తున్నారని, తమపై విమర్శలు చేయడమే రేవంత్​ పనిగా పెట్టుకున్నారని ఫైర్  అయ్యారు. ‘‘74 ఏండ్ల వయసున్న ఆంధ్రప్రదేశ్​ సీఎం  చంద్రబాబు వరద బాధితులను ఆదుకునేందుకు బయట తిరుగుతుంటే, 54 ఏండ్లు ఉన్న మన సీఎం ఇంట్లో ఉన్నాడు. వాతావరణ శాఖ ముందుగా చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదు. అందువల్లే వరద నష్టం ఎక్కువగా జరిగింది” అని హరీశ్​ పేర్కొన్నారు. ఖమ్మంలో  నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేశారు.