
బడ్జెట్ మొత్తం అబద్దాలేనన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. బడ్జెట్ స్పీచ్ రాజకీయ ప్రసంగంలా ఉందని ఫైర్ అయ్యారు. బడ్జెట్ తో అరచేతిలో వైకుంఠాన్ని చూపించారని మండిపడ్డారు . 72 పేజీల భట్టి బడ్జెట్ అబద్ధమన్నారు. పేజీలు పెరిగాయి తప్ప సంక్షేమం పెరగలేదన్నారు హరీశ్.
అసెంబ్లీ సాక్షింగా మహిళలను మరోసారి మోసం చేశారని విమర్శించారు హరీశ్ రావు. మహిళలకు వడ్డీలేని రుణాలు రూ.5 లక్షలే ఇస్తున్నారని చెప్పారు. బడ్జెట్ లో మాత్రం లక్షకోట్ల వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని చెప్పారన్నారు. యూనిఫామ్ కుట్టుకూలీల్లో కూడా అబద్ధాలే చెప్పారన్నారు.
Also Read :- సీఎం రేవంత్పై నమోదైన కేసు కొట్టివేసిన హైకోర్ట్
తాము 6 లక్షల కొత్త రేషన్ కార్డులిచ్చాం..ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని అబద్ధాలు చెప్పారన్నారు హరీశ్ . బడ్జెట్ లో రూ.2500 మహాలక్ష్మి ఊసేలేదు కానీ..అందాల పోటీకి మాత్రం 250 కోట్లు పెట్టారని చెప్పారు. కొత్త పెన్షన్లు దేవుడెరుగు.. ఏడాదిలో 1.5 లక్షల మంది పెన్షన్లు పీకేశారని విమర్శించారు. రుణమాఫీ అయిన వారి కంటే కానీ వారే ఎక్కువ ఉన్నారన్నారు. చేయూత పథకంపై కూడా బడ్జెట్లో మోసం చేశారని తెలిపారు. ఎన్నికలకు ముందు ..ఎన్నికల తర్వాత అన్నీ అబద్ధాలే చెప్పారన్నారు హరీశ్ రావు.