- నిర్బంధాలు, అక్రమ అరెస్టులు తప్ప ఏమీ లేదు: హరీశ్‌రావు
గచ్చిబౌలి, వెలుగు: ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి మార్పు తెస్తానని చెప్పిండు.. నిర్బంధాలు, అక్రమ అరెస్టులేనా మార్పంటే అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తానని.. ఎమర్జెన్సీ పాలన తెచ్చిండని విమ ర్శించారు. గురువారం రాత్రి హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీసులు విడుదల చేసిన తర్వాత హరీశ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కేసులు, ఎఫ్ఐఆర్ లు పోలీస్టేషన్లలో తయారవుత లేవని.. గాంధీభవన్‌లో తయారవుతున్నయని ఆరోపించారు. పోలీసులను అతిగా ప్రయోగించిన ఏ ప్రభుత్వమూ నిలబడలేదనే సంగతి రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు.
రేవంత్ రెడ్డి సర్కారు శాశ్వతంగా ఉండదని, పోలీసులు కూడా ఈ విషయం గుర్తు పెట్టుకోవాలని అన్నారు. సీఎం రేవంత్ ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టా లని టార్గెట్ పెట్టుకున్నడని విమర్శించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడినని, తననెందుకు అరెస్టు చేస్తారని రాహుల్ గాంధీ అడుగుతున్నడు.. మరి తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నడు కదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కూడా బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.