నరేందర్​ రెడ్డి అరెస్ట్​ దుర్మార్గం : ఎమ్మెల్యే హరీశ్​రావు

  • బీఆర్ఎస్ నేత హరీశ్​ రావు

హైదరాబాద్, వెలుగు: మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్​రెడ్డి అరెస్ట్​ అక్రమం, దుర్మార్గమని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. పాలన గాలికి వదిలి అరెస్టు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటని బుధవారం ఓ ప్రకటనలో విమర్శించారు. పచ్చని పొలాల్లో ఫార్మాసిటీ పేరిట చిచ్చు పెట్టడమే ప్రజాపాలన అవుతుందా అని ప్రశ్నించారు.

అర్ధరాత్రి రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టడమే ఇందిరమ్మ రాజ్యమా అని అడిగారు. అక్రమ అరెస్టులు, కేసులు, నిర్బంధాలతో ప్రశ్నించే గొంతులను అణచివేయ లేరన్నారు. ప్రభుత్వ బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదన్నారు. అరెస్టు చేసిన నరేందర్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.