సినిమా వాళ్లను సీఎం భయపెడ్తున్నడు : హరీశ్

సినిమా వాళ్లను సీఎం భయపెడ్తున్నడు : హరీశ్
  • తొక్కిసలాట ఘటనను రాజకీయం చేస్తున్నరు: హరీశ్

హైదరాబాద్/​సికింద్రాబాద్, వెలుగు: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనను ప్రభుత్వం రాజకీయం చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. సినిమా వాళ్లను భయపెట్టి, మంచి చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్​ను గురువారం బీఆర్ఎస్​నేతలతో కలిసి హరీశ్ రావు పరామర్శించారు. శ్రేతేజ్​కు మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు డాక్టర్లు చెప్పారని, అతను త్వరగా కోలుకోవాలని హరీశ్ అన్నారు. 

‘‘తొక్కిసలాట ఘటన దురదృష్టకరం. రేవతి తన ప్రాణాన్ని అడ్డుపెట్టి కొడుకు ప్రాణాలు కాపాడింది. రేవతి మృతి ఆ కుటుంబానికి తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నం” అని పేర్కొన్నారు. ‘‘తొక్కిసలాట జరిగిన తర్వాత 12 రోజులకు మంత్రులు, ముఖ్యమంత్రి స్పందించారు. అంతకుముందు ఎందుకు మాట్లాడలేదు?” అని హరీశ్​ ప్రశ్నించారు.