- సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌పై హరీశ్ రావు ఫైర్
హైదరాబాద్, వెలుగు: బూతులు మాట్లాడడంలో సీఎం రేవంత్‌తో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పోటీ పడుతున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ను డెకాయిట్ అని సంబోధించడం ఉత్తమ్ దిగజారుడు తనానికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం హరీశ్ ఓ ప్రకటన విడుదల చేశారు. "మూసీతో పాటు రేవంత్, ఉత్తమ్ తమ నోళ్లను కూడా ప్రక్షాళన చేసుకోవాలి.
ఇరిగేషన్ పనుల్లో మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇచ్చే పద్ధతిని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రవేశ పెట్టింది. సర్వే, డిజైన్ అడ్వాన్స్‌లను 0.5 శాతం నుంచి 3.5 శాతానికి పెంచి వేల కోట్ల ప్రజా ధనాన్ని దోచుకున్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.17 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్లకు పెంచారు. తుమ్మిడిహెట్టి బ్యారేజి నిర్మాణానికి మహారాష్ట్రతో ఎటువంటి ఒప్పందం చేసుకోకుండానే ప్రాజెక్టు పనులకు టెండర్లు ఖరారు చేసి, అడ్వాన్స్‌లు ఇచ్చి దండుకున్నారు" అని హరీశ్ వివరించారు.