అబద్ధాలతోనే రేవంత్​ పాలన : హరీశ్​ రావు

అబద్ధాలతోనే రేవంత్​ పాలన : హరీశ్​ రావు
  • మూసీ కంపు కన్నా ఆయన చెప్పే కంపే ఎక్కువ: హరీశ్​ రావు

హైదరాబాద్, వెలుగు: అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్​ రెడ్డి.. అవే అబద్ధాల మీద పాలన చేస్తున్నారని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. మూసీ కంపు కన్నా సీఎం చెప్పే కంపే ఎక్కువని విమర్శించారు. రైతు భరోసా ఎప్పుడిస్తారో చెప్పలేదని, రుణమాఫీపై క్లారిటీ ఇవ్వలేదన్నారు. శనివారం ఆయన బీఆర్​ఎస్​ఎల్పీలో మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 15నాటికి రుణమాఫీ పూర్తయిందని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు.

 సీఎం రుణమాఫీని ఎగ్గొట్టి మోసం చేశారని ఫైరయ్యారు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు.. గొంతు చించుకుని చెప్పినా సీఎం మాటల గారడీని ప్రజలు నమ్మరన్నారు. తాము నిజాలు చెప్తామన్న కారణంతోనే స్పీకర్​తమ ఎమ్మెల్యేలకు మైకు ఇవ్వడం లేదన్నారు. అప్పులపై సీఎం తప్పులు మాట్లాడుతున్నారని, దానిపై క్లారిటీ ఇచ్చేందుకు మైక్​ అడిగినా స్పీకర్​ ఇవ్వలేదన్నారు. రేవంత్ తన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు సభలో రెండు గంటలు మాట్లాడారని, బీఆర్​ఎస్​ వాళ్లకు మైక్​ ఇవ్వకండి అంటూ చెప్పి వెళ్లిపోయారని ఆరోపించారు. డిసెంబర్​ 9న అసెంబ్లీని పెట్టడం, అదే రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడం సోనియాను ప్రసన్నం చేసుకోవడానికేనన్నారు.