సీఎం రేవంత్ను అందుకే కలిశాం:హరీశ్, పద్మారావుగౌడ్

సీఎం రేవంత్ను అందుకే కలిశాం:హరీశ్, పద్మారావుగౌడ్

బీఆర్ఎస్ ఎప్పుడూ తెలంగాణ ప్రజల పక్షమే ఉంటుంది..సికింద్రాబాద్ లోని సీతఫల్ మండి ఇంట్రిగ్రేటెడ్ ఇంటర్, డిగ్రీ కాలేజీ నిధులకోసం మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి కలిశామన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే అని బీజేపీ ఎంఎల్ఏ మహేశ్వర రెడ్డి ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు హరీష్ రావు.

తెలంగాణ అసెంబ్లీలో సీఎం ఛాంబర్ లో రేవంత్ రెడ్డిని బీఆర్ ఎస్ నేతలు హరీష్ రావు, పద్మారావు గౌడ్ కలిశారు. అరగంటకు పైగా భేటీ అయ్యారు.  సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు హరీష్ రావు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని సీతాఫల్ మండి ఇంటిగ్రేటెడ్ కాలేజీ నిధుల మంజూరు చేయాలని సీఎంను కోరినట్లు తెలిపారు. 

ALSO READ | తక్కువ వడ్డీకి రుణాలివ్వండి.. నాబార్డు చైర్మన్కు సీఎం విజ్ఞప్తి

గతంలో మాజీ సీఎం కేసీఆర్ ఈ కాలేజీకి 30కోట్ల నిధులు కేటాయించారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చాక.. ఆ నిధులు నిలిపివేశారు. వెంటనే స్కూల్ , కాలేజీ పనులను ప్రారంభించాలని కోరామన్నారు. 

డీలిమిటేషన్ పై స్పందించిన హరీష్ రావు అసెంబ్లీలో పెట్టిన మీటింగ్ ను బహిష్కరించాం.. చెన్నైలో జరిగే మీటింగ్ కాంగ్రెస్ ఆర్గనైజ్ చేయట్లేదు.. డీఎంకే పిలుపు మేరకు బీఆర్ ఎస్ హాజరవుతుందని హరీష్ రావు చెప్పారు.  దక్షణాదికి జరుగుతున్న అన్యాయంపై మెదట మాట్లాందే బీఆర్ఎస్సే.. డీలిమిటేషన్ పై కాంగ్రెస్ పార్టీకి స్టాండ్ లేదు.‌.‌ క్లారిటీ లేదని విమర్శించారు హరీష్ రావు.