కాంగ్రెస్​ గ్యారంటీ గారడీని ప్రజలు నమ్మలేదు

  • కాంగ్రెస్​ గ్యారంటీ గారడీని ప్రజలు నమ్మలేదు
  • మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై హరీశ్​ రావు
హైదరాబాద్​, వెలుగు: మహారాష్ట్రలో ఐదు గ్యారంటీల పేరిట కాంగ్రెస్​చేసిన మాటల గారడీని ప్రజలు నమ్మలేదని బీఆర్ఎస్​ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మోసాలను గమనించిన మహారాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని శనివారం ఆయన ట్వీట్​ చేశారు. తెలంగాణలో మహిళలకు రూ.2,500 ఇస్తామన్న మహాలక్ష్మి పథకం అమలు చేయకుండా మహారాష్ట్రలో రూ.3,000 ఇస్తామనడం, రైతు భరోసా ఎగ్గొట్టడం, ఆసారా దోకా, రైతు రుణమాఫీ ఏడాది గడుస్తున్నా పూర్తి చేయకపోవడం వంటివి మహారాష్ట్రలో తీవ్ర ప్రభావం చూపించాయన్నారు.
 
ముంబై, షోలాపూర్​, పుణె, నాందేడ్​వంటి ప్రాంతాల్లో తెలంగాణ ప్రజలు అత్యధికంగా నివసిస్తుండడంతో కాంగ్రెస్​ మోసాలను గుర్తించగలిగారని తెలిపారు. జేఎంఎం నేత హేమంత్​సోరెన్​పై బీజేపీ పెట్టిన అక్రమ కేసులు, అరెస్టులు, పార్టీని చీల్చే ప్రయత్నాలను జార్ఖండ్​ప్రజలు తిప్పికొట్టారన్నారు.