హోంగార్డులకు జీతాలివ్వకపోవడం సిగ్గుచేటు..ఎమ్మెల్యే హరీశ్​ రావు ట్వీట్​

హోంగార్డులకు జీతాలివ్వకపోవడం సిగ్గుచేటు..ఎమ్మెల్యే హరీశ్​ రావు ట్వీట్​

హైదరాబాద్​, వెలుగు: హోంగార్డు లకు నెల దాటి 12 రోజులవుతున్నా సర్కారు జీతాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​ రావు విమర్శించారు. 16 వేల మందికిపైగా హోంగార్డులు చిన్న జీతాలపైనే బతుకుతున్నారని, జీతాలు రాక చిల్లిగవ్వలేక ఇబ్బం దులు పడుతున్నారని బుధవారం ఆయన ట్వీట్​ చేశారు. ‘‘ఇంటి అద్దె, పిల్లల స్కూలు ఫీజులు, రోజు వారీ ఖర్చులకు అప్పులు చెయ్యాల్సిన దుస్థితి.

ఈఎంఐలు చెల్లించకపోవడం వల్ల బ్యాంకు అధికారులు ఫోన్లు చేసి నిలదీస్తున్న పరిస్థితి. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెలా ఇలాగే జరుగుతున్నా పట్టించుకునేటోళ్లు లేరు. మాటలు కోటలు దాటితే, చేత లు గడప దాటని సీఎం రేవంత్ ​రెడ్డి దానికి ఏం సమాధానం చెబుతారు? పథకాల్లో కోతలు, జీతాలు చెల్లించ కుండా ఉద్యోగులకు వాతలు పెడుతున్నారు. ఇది ప్రజా పాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన. హోంగార్డులకు వెంటనే జీతాలు చెల్లించాలి’’ అని హరీశ్ రావు డిమాండ్​ చేశారు.