బుల్డోజర్లను అడ్డుకోవాలంటూ రాహుల్​కు లేఖ

బుల్డోజర్లను అడ్డుకోవాలంటూ రాహుల్​కు లేఖ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో అధికార దుర్వినియోగంతో దుర్మార్గపు పాలన నడుస్తున్నదని ఎమ్మెల్యే హరీశ్​రావు విమర్శించారు. రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్ నడుస్తున్నదని, దాన్ని అడ్డుకోవాలని కోరుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సోమవారం బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడుతున్నదని పేర్కొన్నారు. మూసీ రివర్ ఫ్రంట్, హైడ్రా ప్రాజెక్టుల విషయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న నిరంకుశ పాలనకు బుల్డోజర్ ప్రతీకగా మారిందని ధ్వజమెత్తారు.