ఎస్ఎల్ బీసీ ప్రమాదం జరిగి పది రోజులైతున్నా పైసా పని జరగలే: బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి

ఎస్ఎల్ బీసీ ప్రమాదం జరిగి పది రోజులైతున్నా పైసా పని జరగలే: బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఎస్ఎల్​బీసీ టన్నెల్​లో ప్రమాదం జరిగి పది రోజులవుతున్నా పైసా పని జరగలేదని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డి అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సోయి లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. సోమవారం తెలంగాణభవన్​లో మీడియాతో ఆయన మాట్లాడారు. 

శ్రీశైలం హైడల్​ పవర్ ప్రాజెక్టులో ప్రమాదం జరిగితే తామెవరం వెళ్లలేదంటూ సీఎం చిల్లర మాటలు మాట్లాడారని, ప్రమాద వార్త తెలిసిన వెంటనే నిమిషాల్లోనే తాము అక్కడకు వెళ్లామన్నారు. ఎస్​ఎల్​బీసీ ప్రమాద ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు.