కృష్ణా ప్రాజెక్టులను తిరిగి రాష్ట్ర పరిధిలోకి తేకపోతే కాంగ్రెస్ వాళ్లను గ్రామాల్లో తిరగనియ్యబోమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి హెచ్చరించారు. కృష్ణా జలాల సాధన కోసం 2024 ఫిబ్రవరి13న నల్గొండలో జరగబోయే బహిరంగ సభ ఏర్పాట్లును ఆయన పరిశీలించారు. కేసీఆర్ సభను దద్దరిల్లేలా నిర్వహిస్తామని, కేసీఆర్ హాజరై కాంగ్రెస్ నిర్వాకాన్ని ఎండగడుతారని చెప్పారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ నేతలు దుర్భాషలాడుతున్నారని మండిపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆఫ్ నాలెడ్జ్ వ్యక్తిని జగదీశ్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ గుర్తులు చేరిపేస్తామని అనడం ఆయన నీచ సంస్కృతి ఎంటో అర్థం అవుతుందని అన్నారు. నిజంగానే కేసీఆర్ గుర్తులు ఇవాళ మాయం అవుతున్నాయని.. 24 గంటల కరెంట్, రైతు బంధు కేసీఆర్ చిహ్నం .. అది ఇవాళ మాయం చేశారన్నారు. రైతు బంధు డబ్బులు అడిగితే చెప్పుతో కొడతామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని మండిపడ్దారు.