
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మార్చి 24న ఉదయం అసెంబ్లీకి వచ్చారు. బీఆర్ఎస్ సభ్యులతో కలిసి జగదీష్ రెడ్డి అసెంబ్లీకి వచ్చారు. అయితే సభకు రావొద్దని చీఫ్ మార్షల్ జగదీష్ రెడ్డికి సూచించారు. తనను అసెంబ్లీకి రావొద్దని స్పీకర్ ఇచ్చిన బులెటిన్ చూపెట్టాలని జగదీష్ రెడ్డి అడిగారు.
స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జగదీశ్ రెడ్డిపై బడ్జెట్ సెషన్ ముగిసే వరకు సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే. మార్చి 13న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పీకర్ ను నువ్వు అని సంబోధించారు. ‘సభ మీ సొంతం కాదు సభ అందరిదీ సభకు మీరు పెద్ద మనిషి మాత్రమే’ అని స్పీకర్ ను ఉద్దేశించి వ్యాఖ్య చేశారు.
Also Read : స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాపై కేసు
దళిత స్పీకర్ ను కావాలని అవమానించారని కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. స్పీకర్ చైర్ ను అవమాన పర్చేలా వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రిపై వేటు వేయాలని ప్రతిపాదిస్తూ శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీర్మానం ప్రవేశపెట్టగా..ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.