- ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
యాదాద్రి, వెలుగు: ‘కేసీఆర్‌ను చంపడానికైనా.. రేవంత్‌రెడ్డిని చంపడానికైనా ఒక్క బుల్లెట్ చాలు, కానీ బుల్లెట్వాడేదీ ఎవరు ? క్రిమినల్స్‌కు, కిరాయి హత్యలు చేసే వాళ్లకే ఆ ఆలోచన వస్తది, జేబులు కొట్టేవాళ్లే కత్తెర్లు పెట్టుకుంటరు, ఇటువంటి ఆలోచనలతోనే వచ్చిన వ్యక్తే రేవంత్‌రెడ్డి’ అని సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. యాదాద్రి జిల్లా ఆలేరులో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రజా సమస్యల గురించి ఆలోచించకుండా ఫోన్ ట్యాపింగ్ పేరుతో కాలం గడుపుతున్నారన్నారు. నీళ్లు అడిగితే దొంగ ప్రచారాలు చేస్తూ, కేసీఆర్ లాగు ఊడగొడతానంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మిల్లర్లతో మిలాఖర్ అయి రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఒక్కో మిల్లర్ల వద్ద రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు వసూలు చేశారన్నారు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీచైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, భిక్షమయ్యగౌడ్ పాల్గొన్నారు.