సూర్యాపేట: కాంగ్రెస్ ఆధ్వర్యంలోని సీఎం రేవంత్ రెడ్డి పాలనలో వంద రోజుల్లో వంద దోపిడీలు జరిగాయి తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. ఇవాళ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగు పల్లి గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. తెలంగాణలో సాగునీరు లేక రైతులు కరువుతో అల్లాడిపోతున్నారన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యమో లేకా అవగాహన లేకనో కానీ రైతులకు ప్రత్యామ్నాయం చూపాలనే సోయే లేదని మండిపడ్డారు.
కాళేశ్వరం ద్వారా ఎండిన పొలాలకు నీరందించే అవకాశం ఉన్నా. పిల్లర్లు కుంగాయని కాలయాపన చేస్తున్నారు తప్పపరిష్కార మార్గం మాత్రం వెతకడం లేదన్నారు. కాంగ్రెస్ అబద్దాల హామీలను నమ్మి ప్రజలు నిండా మునిగారని అన్నారు. రైతులకు రైతు బంధు, రాలేదని, రుణమాఫీ ఊసేలేదన్నారు. కేంద్రంలో మోడీ,రాష్ట్రంలో రేవంత్ ప్రజలకు శనిలా దాపురించారని ఫైర్ అయ్యారు.