- పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో కడియం శ్రీహరి
జయశంకర్ భూపాలపల్లి/ మహాదేవ్‌పూర్/ కాటారం, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టుతో 20.33 లక్షల ఎకరాలకు సాగు నీళ్లు ఇచ్చామని, ఇందులో 3.04 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఉందని బీఆర్ఎస్ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్పారు. ‘కాళేశ్వరంపై కాంగ్రెస్ విషప్రచారం.. బీఆర్‌ఎస్ వాస్తవాలు’ పేరుతో అన్నారం బ్యారేజీ దగ్గర ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
‘‘కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదు. దీని కింద కట్టిన రిజర్వాయర్లు, సబ్ స్టేషన్లు, పంప్‌హౌస్‌లు, సొరంగాలు, గ్రావిటీ కెనాల్స్ అన్నీ ప్రాజెక్టు పరిధిలోకే వస్తాయి. ఈ ప్రాజెక్టుకు రూ.93 వేల కోట్లు ఖర్చు చేసి, 98 వేల ఎకరాలకే నీరు ఇచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెబుతున్నది” అని అన్నారు.