కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య

బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది.  ఆ పార్టీ చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ లో చేరారు.  ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్‌ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. దీంతో అసెంబ్లీలో  కాంగ్రెస్ బలం 71కి చేరుకుంది. కాగా ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి,  పొచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావ్,  సంజయ్ కుమార్, దానం నాగేందర్  కాంగ్రెస్ లో చేరారు.  

కాలె యాదయ్య కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.  ఎంపీపీ, జెడ్పీటీసీగా పని చేసి, 2009లో చేవెళ్ల నియోజకవర్గం నుండి పోటిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోరాని సాయన్న రత్నం చేతిలో ఓడిపోయాడు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కోరాని సాయన్న రత్నంపై 781 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి 33 వేల 552 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో గెలిచారు.