బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. అరికపూడి గాంధీతో జరిగిన వివాదంలో కౌశిక్ రెడ్డి ఆంధ్రా సెటిలర్స్ బతకడానికి వచ్చారని.. అవమానించేలా మాట్లాడారని మండిపడ్డారు. ఆంధ్రా వాళ్ల ఓట్లు, సీట్లు చివరకు నోట్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి కావాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రా సెటిలర్ ఓటర్ల బీఆర్ఎస్ పరువు కాపాడారు.. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్యెల్యేల అవసరం తీరిపోయిన తర్వాత ఆంధ్రా సెటిలర్స్ బతకడానికి హైదరాబాద్ వచ్చారని మాట్లాడుతున్నారని ఆయన కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు.
ALSO READ | హరీష్ రావుతోపాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్
ఆంధ్రా సెటిలర్స్ పైన బీఆర్ఎస్ నిజస్వరూపం ఇప్పుడు బయటపడిందని వేములవాడ ఎమ్మెల్యే తెలిపారు. పాడి కౌశిక్ రెడ్డి పైన ఆంధ్రా సెటిలర్ల పైన చేసిన వ్యాఖ్యలను కేసీఆర్, హైదరాబాద్, రంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించకపోతే తక్షణమే ఆయనను బీఆర్ఎస్ నుంచి బహిష్కరించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు.