హైదరాబాద్: మేడ్చల్, శామీర్‌పేట వరకు మెట్రో మార్గం పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించడం ప్రజల విజయమని బీఆర్ఎస్ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. ఆయా మార్గాల్లో పనులను మొదటి ప్రాధాన్యంగా పెట్టుకొని పూర్తి చేయాలన్నారు. ఎప్పటిలోపు పూర్తి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘మాజీ సీఎం కేసీఆర్ మార్గంలోనే సీఎం రేవంత్‌రెడ్డి నడవక తప్పదు. మేడ్చల్, శామీర్‌పేట్ వరకు మెట్రోమార్గం పొడిగిస్తూ సీఎం చేసిన ప్రకటనతో అది రుజువైంది.
మెట్రో విషయంలోనే కాదు.. జలవనరులు, విద్యుత్ శాఖలోనూ కేసీఆర్ చూపిన మార్గంలో ముందుకు వెళ్లాల్సిందేనన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాయదుర్గం నుంచి శంషాబాద్‌కు ప్రారంభమైన పనులను రద్దు చేసింది. ఆ పనులు మళ్లీ మొదలు పెట్టేందుకు చర్యలు తీసుకోవాలి. సైంటిఫిక్‌గా స్టడీ చేసి పనులు ప్రారంభించిన మెట్రో రూట్‌ను రద్దు చేయొద్దు. ఎలివేటెడ్ కారిడార్‌కు శంకుస్థాపన చేసి ఏడాది కావొస్తున్నా.. ఇప్పటివరకు తట్టెడు మట్టి కూడా వేయలేదు. ’ అని వివేకానంద అన్నారు.